సెన్సార్ పూర్తయిన 'యాగం'
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భూమిక, యువతరం హీరో నవదీప్, గ్లామర్ నటి కమ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'యాగం'. డౌన్ టౌన్ ఫిలింస్ సమర్పణలో సిల్వర్ స్క్రీన్ మూవీస్ బ్యానర్ పై రాజు, ప్రవీణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పి.ఎ.అరుణ్ ప్రసాద్ ('తమ్ముడు' ఫేమ్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈనెలాఖరులోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
వైవిధ్యమైన కథ-కథనాలతో తెరకెక్కిన చిత్రమిదనీ, ఇందులో భూమిక ఎయిర్ హోస్టెస్ గా నటించగా, నవదీప్ బ్యాంకాక్ లోని ఓ హోటల్ పనిచేస్తుంటాడనీ, అతని ప్రేయసిగా కిమ్ శర్మ నటించిందనీ వారు చెప్పారు. ఈ ముగ్గురి జీవితంలో సంభవించిన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తమని అన్నారు. సెన్సార్ పూర్తయిన ఈ చిత్రాన్ని నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, అజయ్, ఆలీ, రాహుల్ దేవ్, హర్షవర్దన్ తదితరులు నటించారు. భరణి కె ధరన్ సినిమాటోగ్రఫీ, సెల్వ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|