ఎన్టీఆర్ తో చైతన్య హీరోయిన్
నాగచైతన్య 'ఏ మాయ చేసావె' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవుతున్న సమంత ఆ చిత్రం విడుదల కాకుండానే స్టార్ హీరో ఎన్టీఆర్ తో నటించే గోల్డెన్స్ ఛాన్స్ దక్కించుకుంది. ఎన్టీఆర్ 'బృందావనం' (గోవిందుడు అందరి వాడేలే)చిత్రంలో మరో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేశారు. ఇందులో ప్రధాన హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది.
ఇటీవలే 'ఏమాయ చేసావె' స్టిల్స్, ట్లైలర్స్ విడుదల కావడం, అందులో సమంత అందంగా కనిపించడంతో పాటు ఫోటోజెనిక్ ఫేస్ కూడా కావడంతో ఆమెకు 'బృందావనం'లో చోటు దక్కింది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి ('మున్నా' ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో, కుటుంబ విలువలు, భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల హైదరాబాద్ లో షూటింగ్ కు అవాతారం కలగడంతో పొల్లాచ్చిలో ఓ కీలక షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం 'శక్తి' షూటింగ్ లో భాగంగా జైపూర్ లో ఉన్న ఎన్టీఆర్ అక్కడి నుంచి తిరిగి రాగానే హైద్రాబాద్ లో ఈనెల 20 నుంచి 'బృందావనం' మరో షెడ్యూల్ మొదలవుతుంది. ఇందులో ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, శ్రీహరి, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులో సినిమా రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతోంది.
Be first to comment on this News / Article!
|