ఈతరం బ్యానర్ లో తనీష్
యువ హీరో తనీష్ వరుస చిత్రాలతో బిజీ అవుతున్నారు. ఉషాకిరణ్ మూవీస్ 'నచ్చావులే' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలి సక్సెస్ ను సాధించిన తనీష్ ఇటీవలే బెల్లంకొండ సురేష్ తీసిన 'రైడ్'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సాయిదేవ ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న 'మౌనరాగం' చిత్రంతో హాట్రిక్ కు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకొంటూ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మరో ప్రిస్టేజియస్ బ్యానర్ లోనూ తనీష్ హీరోగా నటిస్తున్నారు. ఈతరం మూవీస్ బ్యానర్ పై పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈతరం బ్యానర్ పై 'నేటి భారతం', 'నవోదయం', 'వందేమాతరం', 'దేవాలయం', 'దేశంలో దొంగలు పడ్డారు', 'ఎర్రమందారం' వంటి పలు హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఇటీవల కాలంలో గోపీచంద్ కథానాయకుడుగా 'యజ్ఞం', 'ఒంటరి' చిత్రాలు కూడా ఇదే ఇదే బ్యానర్ లో వచ్చాయి. 'యజ్ఞం' చిత్రాన్ని హిట్ చేసిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలోనే ఇప్పుడు తనీష్ హీరోగా ఈతరం కొత్తచిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రచారార్భాటాలకు దూరంగా షూటింగ్ జరుపుకొంటోంది.
Be first to comment on this News / Article!
|