'శ్రావ్య' ఐ హేట్ యు...
దీపక్, కనిక హీరోహీరోయిన్లుగా 'శ్రావ్య' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్రారంభం కానుంది. దీనికి 'ఐ హేట్ యు' అనే ట్యాగ్ లైన్ ఉంది. మానస ఆర్ట్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశివర్మ ('4 బాయ్స్' ఫేమ్) దర్శకుడు. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్ లో ఈనెలాఖరున ప్రారంబిస్తున్నట్టు నిర్మాత రాజ్ కుమార్ తెలిపారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే ఓ యువతి కథే ఈ చిత్రమనీ, ప్రస్తుతం నైన్త్ క్లాస్ (ఏలేశ్వరం) చిత్రాన్ని నిర్మిస్తున్న తమ సంస్థ నుంచి మరో మంచి చిత్రాన్ని త్వరలో ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందనీ అన్నారు. తాజా చిత్రానికి అనంత్ శ్రీరామ్ అన్ని పాటలు రాశారనీ, ఇందులోని ఐదు పాటలకు సత్యం సంగీత సారథ్యంలో రికార్డింగ్ జరుగుతోందనీ చెప్పారు. దీపక్, కనిక (నూతన పరిచయం) హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో పలువురు సీనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, నర్సింగ్ యాదవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, షఫి, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, హేమ, భువనేశ్వరి తదితరులు నటించనున్నారు. శ్యామ్ కుమార్ సినిమాటోగ్రఫీ, రంగస్వామి ఎడిటింగ్ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|