'వరుడు'కు పాట బ్యాలెన్స్
హీరో అల్లు అర్జున్, దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్ లో యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'వరుడు'. ఈ చిత్రం ఒక మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకనిర్మాతలు ఈ విషయాన్ని తెలియజేశారు.
గుణశేఖర్ మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వస్తోందనీ, ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందనీ తెలిపారు. ఈ పాటను మార్చి మొదటివారంలో చిత్రీకరిస్తామని చెప్పారు. ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, అతని కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనీ ధీమా వ్యక్తం చేశారు. తమిళ హీరో సూర్య ఇందులో వినల్ గా అద్భుతంగా నటించారనీ, అలాగే 100కు పైగా కుటుంబాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాలో నటించడం మరో విశేషమనీ చెప్పారు. అన్ని పాటలకు వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం ఇచ్చారనీ, టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటూ విజువల్ గ్రాండియర్ తో అందర్నీ ఆకట్టుకునే చిత్రమవుతుందనీ అన్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ, అల్లు అర్జున్ తో 'దేశముదురు' వంటి సూపర్ హిట్ తర్వాత తమ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రం దాదాపు పూర్తయిందనీ, అల్లు అర్జున్ నటన సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుందనీ చెప్పారు. గుణశేఖర్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయనీ తెలిపారు. మార్చి 26న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా ఓ కొత్తమ్మాయిని పరిచ్యం చేస్తున్నారు. ఇతర పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, సింగీతం శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం గుణశేఖర్ అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, అశోక్ ఆర్ట్, స్టన్ శివ ఫైట్స్, ఆంథోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|