మెగాస్టార్ అనగానే గుర్తుకు వచ్చే హీరో చిరంజీవి. అభిమానులు ఆయనను అలాగే పిలుచుకుంటారు. టాలీవుడ్ వరకూ చూసుకున్నా ఇంతవరకూ అలా పిలిపించకుకున్నది ఆయనే. సుమారు పాతికేళ్ల పాటు అప్రహతంగా నెంబర్ వన్ స్థానాన్ని కూడా ఆయన నిలుపుకొంటూ అభిమానుల హృదాయాల్లో మెగాస్టార్ గానే నిలిచారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అందుకు తగ్గట్టే 'మెగాస్టార్' అనే టైటిల్ కు చెందిన ఈక్వేషన్లు కూడా మారి ఉండొచ్చా? ఆ అనుమానానికి ఇప్పుడు ఆస్కారం కలిగింది. జూనియర్ ఎన్టీఆర్ ను మెగాస్టార్ గా సంబోధిస్తూ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో సోమవారం ఓ ఆర్టికల్ వచ్చింది.
కెరీర్ ను జెట్ స్పీడ్ లో ప్రారంభించేందుకు స్టార్ ఫ్యామిలీలో పుట్టడం ఏ మేరకు ఉపయోగపడిందనే విషయంపై ఎన్టీఆర్ ఇచ్చిన వివరణను సదరు ప్రతినిధి ఇలా రిపోర్ట్ చేశారు. 'స్టార్ ఫ్యామిలీలో పుట్టడం (మెగాస్టార్ మనమడు కావడం) నా తొలిసినిమా వరకూ చాలా ఉపయోగపడింది. కుటుంబ నేపథ్యం, తాతగారి ప్రతిభాపాటపాటవాలను దృష్టిలో పెట్టుకుని జనం కూడా అలాంటి అంచనాలతోనే సినిమా చూస్తారు. అయితే ఆ తర్వాత మాత్రం ఏ నటుడైనా సొంత ప్రతిభతో మాత్రమే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఎన్టీఆర్ మనవడుగా పిలిపించుకోవడాన్నినేనెంతగానో ఇష్టపడతాను. ఆయన ప్రభావం నామీద పడకూడదనే ప్రయత్నాలు కూడా ఎప్పుడూ చేయలేదు. అలాంటి పంథానే నాకు ఇష్టం కూడా' అని ఎన్టీఆర్ వివరించారు. ఇక్కడ 'మెగాస్టార్' అంటే పెద్ద ఎన్టీఆర్ అనుకోవచ్చు. కానీ...స్టోరీ సూపర్ లీడ్ లో మెగాస్టార్ ఎన్టీఆర్ జూనియర్ అంటూ రిపోర్ట్ చేయడం మాత్రం మెగా(చిరు)భిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో?!