గోపీచంద్ తో నల్లమలుపు
మాస్ హీరో గోపీచంద్ తో 'లక్ష్యం' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మరో కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తర్వాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వం వహించనున్నారు.
బి.గోపాల్ గతంలో 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' వంటి పలు బ్లాక్ బస్టర్స్ ను అందించారు. ఇటీవల కాలంలో ఆయన రామ్ కథానాయకుడుగా 'మస్కా' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం కమర్షియల్ సక్సెస్ అనిపించుకుంది. ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న బి.గోపాల్ ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారు. గోపీచంద్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గోలిమార్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే బి.గోపాల్ చిత్రం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.
Be first to comment on this News / Article!
|