కొత్త హీరోల 'స్నేహబంధం'
నలుగురు కొత్త హీరోలను పరిచయం చేస్తూ ఇంద్రగంటి క్రియేటివ్ మూవీస్ బ్యానర్ పై 'స్నేహబంధం' అనే కొత్త చిత్రం రూపొందుతోంది. సుహాస్, సునీల్, పరమేష్, ప్రదీప్ హీరోలుగా పరిచయం అవుతున్నారు. శ్రీను బండే దర్శకత్వంలో ఐ.ఎన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో సోమవారంనాడు జరిగింది. తొలి సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.సాగర్ క్లాప్ ఇవ్వగా, ఆయన కుమారుడు చందు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇంద్రగంటి గౌరవ దర్శకత్వం వహించారు.
ప్రేమ, స్నేహం ప్రధానాంశాలుగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. సంగీతానికి ఎంతో ప్రాధ్యాన్యం ఉండే ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని చెప్పారు. చిత్ర సమర్పకుడు ముదిలి అప్పలరాజు మాట్లాడుతూ, మంచి సబ్జెక్ కావడంతో సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చామనీ, ఈ నెల చివరి వారంలో రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నలుగురు యువ హీరోలతో పాటు నటి లక్ష్మీకరుణ పాల్గొంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఎమ్మెస్ నారాయణ, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, ఆలీ, సచిన్, సన, కిరణ్ తదితరులు నటించనున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం శ్రీను బండే అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్-కందికొండ పాటలు, ధనుంజయ్ సినిమాటోగ్రఫీ, రవికాంత్ ఫైట్స్, సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|