25న 'కళవర్ కింగ్' రాక
నిఖిల్ ('హ్యాపీడేస్', 'యువత' ఫేమ్), శ్వేతబసుప్రసాద్ ('కొత్తబంగారులోకం', 'రైడ్' ఫేమ్) జంటగా రూపొందిన యూత్ ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'కళవర్ కింగ్'. సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఎం.చంద్రశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అనీ, కేవలం కథ నచ్చి ఈ సినిమా చేశామనీ నిర్మాతల్లో ఒకరైన డి.ఎస్.రావు తెలిపారు. కథ-కథనాలతో పాటు దర్శకుడు సురేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఆసక్తికరంగా ఉంటుందన్నారు. హీరో నిఖిల్, విలన్ అజయ్ మధ్య పోటాపోటీ దృశ్యాలు ఉంటాయనీ, శ్వేతబసు తన నటన, గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తుందనీ చెప్పారు. నిఖిల్ పాత్ర చలాకీగా, అల్లరిగా ఉంటుందనీ, 70 శాతం వినోదం, 30 శాతం సెంటిమెంట్ ఇందులో ఉంటుందనీ ఆయన తెలిపారు. 'నువ్వు-నేను' ఫేమ్ అనిత చేసిన ప్రత్యేక గీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుదని చిత్ర సహనిర్మాతలు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తెలిపారు. అనిల్ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. ఈనెల 25న సినిమా విడుదలవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో అజయ్, ఆలీ, వేణుమాధవ్, రఘబాబు, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, కాశీ విశ్వనాథ్, గౌతంరాజు, సత్తెన్న, దువ్వాసి మోహన్, సుమన్ శెట్టి, దేవీశ్రీ, ప్రగతి తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే సైతం ఎల్.సురేష్ అందించిన ఈ చిత్రానికి చందు సంభాషణలు అందించారు.
Be first to comment on this News / Article!
|