రొమాంటిక్ హీరోగా సుమంత్
హీరో సుమంత్ ఇటీవల కాలంలో సరైన సక్సెస్ చవిచూడకపోవడంతో కొద్ది పాటి గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు ఓ కొత్త చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఫ్లాపులు చవిచూసిన సుమంత్ ఆ తర్వాత 'సత్యం', 'గౌరి', 'గోదావరి', 'మధుమాసం' వంటి హిట్లు చవిచూశారు. ఆ తర్వాత వచ్చిన 'క్లాస్ మేట్స్', 'పౌరుడు' చిత్రాలు నిరాశపరచాయి. కథపై ఉన్న నమ్మకంతో ఏడాదిన్నర పాటు
కొత్త సినిమా ఏదీ ఒప్పుకోకుండా చేసిన 'బోణి' చిత్రం సుమంత్ కు మరో ఫ్లాప్ ను అందించింది. దీంతో సుమంత్ కొద్ది గ్యాప్ తీసుకుని ఇప్పుడు సరైన ప్లానింగ్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన తదుపరి చిత్రాన్ని రవి సి కుమార్ దర్శకత్వంలో పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనీ, కథలో ఒక మంచి సందేశం కూడా మిళితమై ఉంటుందనీ తెలుస్తోంది.
రవి సి కుమార్ ఇంతవరకూ జగపతిబాబు కథానాయకుడుగా 'సామాన్యుడు', నితిన్ తో 'విక్టరీ' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ రెండో యావరేజ్ అనిపించుకున్నారు. గత రెండు చిత్రాల విషయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మూడో చిత్రాన్ని హిట్ చేయబోతున్నానని రవి సి కుమార్ చెబుతున్నారు. బాక్సాఫీస్ ను ఆకట్టుకోగలిగిన హీరో, మంచి స్టోరీలైన్ తన చిత్రాన్ని విజయపథం వైపు నడిపిస్తాయని ఆయన ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Be first to comment on this News / Article!
|