'ధూల్' ఆడియో రిలీజ్
సుధన్ రాజ్, మను హీరోలుగా, పాయల్ శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ధూల్'. ఫైట్ మాస్టర్ బి.విక్కీ దర్శకత్వంలో కె.ఆర్.శ్రీనివాస్ అయ్యంగార్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డి.సురేష్ బాబు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని మరో అతిథి ఎ.కోదండరామిరెడ్డికి అందజేశారు. ఖుద్దూస్ సంగీతం అందించిన ఆడియో జై మారుతీ మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది.
తొలుత శ్రీహరి మాట్లాడుతూ, విక్కీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దర్శకత్వం పట్ల మంచి అభిరుచి ఉన్న విక్కీకి ఇది మంచి సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ కావాలని దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.సాగర్ అభిలషించారు. సంగీత దర్శకుడు ఖుద్దూస్ తనకు పదేళ్లుగా తెలుసనీ, ఈ చిత్ర సంగీతం ఎంతగానో అలరింపజేస్తుందనీ పోకూరి బాబూరావు అన్నారు. ఖుద్దూస్ అంటే ఏమిటో 'నిధి' చిత్రం తెలియజేస్తుందనీ, ఈ చిత్రం ఆయనకు మరింత మంచి పేరు తెస్తుందనీ దేవీశ్రీప్రసాద్ అన్నారు. విక్కీ మాట్లాడుతూ, ఫైట్ మాస్టర్ తీసిన సినిమా అనగానే ఫైట్స్ ను ఎక్కువగా ఊహిస్తారనీ, అయితే అందుకు భిన్నంగా ప్రేమకథాంశంతో ఈ చిత్రాన్ని తీశామనీ చెప్పారు. నిర్మాత అయ్యంగార్ మాట్లాడుతూ, పరిశ్రమ పట్ల అంతగా అవగాహన లేకుండానే ఇందులోకి వచ్చాననీ, తమ బంధువైన సుధన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తున్నామనీ చెప్పారు. ఇందులో మూడు మెలోడీ, రెండు ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఉన్నాయని ఖుద్దూస్ తెలిపారు. ఈ వేడుకలో ఆడియో సీడీ వేలం ద్వారా వచ్చిన 4,000 రూపాయలను సీనియర్ నటుడు పొట్టి వీరయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, వై.టి.రాజబాబు, ఎలమర్తి నారాయణ చౌదరి, ముత్తవరపు మురళీకృష్ణ, ఆర్.పి.పట్నాయక్, ఘంటాడి కృష్ణ, చిత్ర హీరోలు సుధన్ రాజు, మను, నటుడు కొండవలస తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|