'రంగా ది దొంగ'లో విమల
వీధి గూండా మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తితో గాంధేయవాదిగా మారిన కథాంశంతో శ్రీకాంత్ నటించిన 'మహాత్మ' ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంది. శ్రీకాంత్ నూరవ చిత్రంగా దీనిని ఆయన స్నేహితుడు సి.ఆర్.మనోహర్ నిర్మించారు. తాజాగా మళ్లీ శ్రీకాంత్ తోనే సి.ఆర్.మనోహర్ 'రంగా' అనే కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. దీనికి 'ది దొంగా' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇటీవలే నితిన్ కథానాయుకుడు 'హీరో' చిత్రానికి దర్శకత్వం వహించిన సుధాకర్ నాయుడు (జీవి) ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికితోడు సి.ఆర్.మనోహర్ తో కలిసి ఈ చిత్రానికి నిర్మాతగా కూడా జీవి వ్యవహరించబోతున్నారు. గోల్డెన్ లైన్ ఫిలిమ్స్, గాడ్ ఫాదర్ ఫిలిమ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ ఈనెల 19న ప్రారంభమవుతుంది. రెగ్యులర్ షూటింగ్ 25 నుంచి మొదలవుతుంది.
ఈ చిత్రంలో శ్రీకాంత్ ఒక దొంగగా కనిపిస్తారనీ, దీనిని బట్టే ఆయన పాత్ర ఎంత ఎంటర్ టైన్ మెంట్ తరహాలో ఉండబోతోందో ఊహించుకోవచ్చనీ జీవీ అంటున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కు జోడిగా అందాల నటి విమలారామన్ ఎంపికైంది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించనున్నట్టు సమాచారం. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, శివాజీ రజా, జయప్రకాష్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు.
Be first to comment on this News / Article!
|