'ఏమాయ..'కు 2 క్లైమాక్స్ లు
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ను 'మాస్టర్ ఆప్ డబుల్ క్లైమాక్సెస్' అని పిలుస్తుంటారు. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని తన సినిమాలకు ముందుగా అనుకున్న క్లైమాక్స్ తో పాటు మరో క్లైమాక్స్ ను కూడా ముందే తీసి ఉంచుకుంటారు. ప్రేక్షకులకు ఒక క్లైమాక్స్ నచ్చకపోతే ఆయన వెంటనే రెండో క్లైమాక్స్ ను ముందుకు తీసుకువస్తారు. తాజాగా ఆయన నాగచైత్యన-సమంత జంటగా రూపొందించిన 'ఏమాయ చేసావే' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని తమిళంలో 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కించారు. అందులో శిలాంబరసన్ (శింభు), త్రిష జంటగా నటించారు. ఈనెల 26న 'ఏమాయ చేసావే' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే రోజు తమిళ వెర్షన్ కూడా విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది.
గౌతమ్ మీనన్ షరామామూలుగానే తన తాజా చిత్రం కోసం రెండు క్లైమాక్స్ లు సిద్ధం చేసినట్టు సినీ వర్గాల తాజా భోగట్టా. ఇందులో ఒక క్లైమాక్స్ విషాదాంతం కాగా, మరొకటి సుఖాంతం. ఇందులో ఏ క్లైమాక్స్ ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది సినిమా రిలీజ్ తర్వాతే తేలుతుంది. రెండు రోజుల పాటు పబ్లిక్ టాక్ పరిశీలించి అవసరమైతేనే రెండో క్లైమాక్స్ కు గౌతమ్ మీనన్ షిఫ్ట్ అవుతారట. ఇందులో నిజానిజాలేమిటో తెలియాలంటే మరో పది రోజులు ఆగితే సరి...
Read 3 Comment(s) posted so far on this News / Article!
|