రాజా 'ఇంకోసారి' 26న
రాజా, మంజరి ఫడ్నీస్ జంటగా, రిచా ('నువ్వేకావాలి' ఫేమ్), సందీప్, రవి వర్మ, విన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంకోసారి'. బే ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా, తెలుగు సినిమాల ఎగ్జిబిటర్ గా మంచి పేరున్న కల్యాణ్ పల్లా తొలిసారిగా బే మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమన్ పాతూరి తొలిసారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నిర్మాత కల్యాణ్ పల్లా మాట్లాడుతూ, కాలేజీలో కలిసి చదువుకున్న మిత్రులు ఆ తర్వాత ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడతారనీ, కాలేజీరోజుల నాటి మధుర జ్ఞాపకాలు గుర్తుకురాగానే మళ్లీ ఆ స్నేహితులంతా కలసి గడపాలని అనుకుంటారనీ, అలా ఇంకోసారి కలుసుకున్న స్నేహితుల కథే ఈ చిత్రమనీ తెలిపారు. ఇంకోసారి కలిసినప్పుడు ఆ కలయిక వారి జీవితాలలో ఎలాంటి ప్రభావం చూపిందనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందన్నారు. 'వెన్నెల' ఫేమ్ మహేష్ శంకర్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందిందని చెప్పారు. హీరో రాజా మాట్లాడుతూ, నాలుగేళ్ల తర్వాత మళ్లీ 'వెన్నెల' టీమ్ తో పనిచేసిన చిత్రమిదనీ, వెన్నెల తరహాలోనే ఈ చిత్రం కూడా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. సుమన్ పాతూరి ఎంతో ప్రతిభావంతుడనీ, ఆయన దర్శకత్వంలో తాను ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాననీ తెలిపారు. తాజా చిత్రంలో గొల్లపూడి మారుతీరావు, రమేష్, హరీష్, భరత్ తదితరులు నటించారు. రాజ్, డికె సంయుక్తంగా కథ-స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి నాగరాజు గంధం మాటలు అందించారు.
Be first to comment on this News / Article!
|