20న యూత్ ఫుల్ 'జాయ్'
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా 'జాయ్' చిత్రం రూపొందినట్టు ఆ చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు. అవితేజ్, త్రినాథ్, వైనవి, పార్వతి, సునీల్ ప్రధాన తారాగణంగా ఇరుణై పిక్చర్స్ పతాకంపై ఇవివి కంభన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇ.వి.కుమార్ సమర్పకుడు. బి.రాజా దర్శకత్వం వహించిన ఈనెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రాజా మాట్లాడుతూ, ఇది చక్కటి యూత్ ఫుల్ ఎంటర్ టైన్ అయినప్పటికీ నవరసాలూ సమపాళ్లలో ఉంటాయనీ, ఎలాంటి అశ్లీలత లేకుండా సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించామనీ, సకుటుంబ సమేతకంగా చూడదగిన చిత్రమనీ అన్నారు.. సునీల్ కామెడీ, విద్యాసాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ అవుతాయని తెలిపారు. ఇందులోని ఆరు పాటల్లో రెండు పాటలు విదాశాల్లో చిత్రీకరించినట్టు చెప్పారు. మాటల రచయిత స్వర్ణ సుధాకర్ మాట్లాడుతూ, ఈ టీమ్ లో అంతా కొత్తవారే అయినప్పటికీ చాలా కమిట్ మెంట్ తో నటించారనీ, ఈ సినిమాకి కథే హీరో అనీ అన్నారు. హీరో త్రినాథ్ మాట్లాడుతూ, చదువులో వెనకబడినా జీవితంలో ముందడుగు వేసే కుర్రాడి పాత్ర తనదని, హీరోగా తనకిది తొలి చిత్రమనీ చెప్పారు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నట్టు మరో హీరో అవితేజ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి భువనచంద్ర మాటలు, ఆకాశ్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|