ఐపిఎల్ అంబాసిడర్ రానా
దగ్గుబాటి రానా చక్రం తిప్పబోతున్నారు. శతాధిక చిత్రాల 'గిన్నెస్' నిర్మాత డి.రామానాయడు మనవడు, సురేష్ బాబు తనయుడైన రానా 'లీడర్' చిత్రంతో ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే దీనికంటే ముందే రానా చేతికి పలు ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ లు వచ్చి పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఆయన రోహన్ సిప్పీ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, ప్రతీక్ బబ్బర్ వంటి హీరోలతో కలిసి గోవా నేపథ్యంలో సాగే డ్రగ్ మాఫియా కథాంశంతో హిందీలోకి అడుగుపెడుతున్నారు. గోవాలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ లో ఇటీవల రానా పాల్గొన్నారు కూడా. తాజాగా ఈ హ్యాండ్ సమ్ లీడర్ కు మరో అరుదైన అవకాశం దక్కింది. అయితే ఇది సినిమా అవకాశం కాదు. బ్రాండ్ అంబాసిడర్ అవకాశం. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ నడుస్తున్న తరుణంలో ఐపిఎల్ డక్కన్ చార్జెస్ కోసం ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైనట్టు తాజా సమాచారం.
మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలంతా సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత ప్రిస్టేజియస్ బ్రాండ్ లకు అంబాసిడర్లు కాగా, తొలి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఐపిఎల్ డక్కన్ ఛార్జెస్ నుంచి రానాకు అవకాశం రావడం విశేషంగానే చెప్పాలి. క్రికెట్ వీరాభిమాని కూడా అయిన సురేష్ బాబు ప్రస్తుతం ఈ ఆఫర్ కు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నారనీ, రానా సైతం ఈ ఆఫర్ పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారనీ తెలుస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలీ అభిమానులకు ఇది శుభవార్తే.
Be first to comment on this News / Article!
|