సౌందర్య రజనీ నిశ్చితార్ధం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య నిశ్చితార్ధం చెన్నైలోని పార్క్ షెరటాన్ హోటల్ లో బుధవారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. పారిశ్రామిక వేత్త అశ్విన్ రామ్ కుమార్ తో సౌందర్య నిశ్చితార్ధం జరిగింది. ముఖ్యమంత్రి కరుణానిధి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. కరుణానిధి సతీమణులైన దయాలు అమ్మల్, రజతి అమ్మల్, కుమార్తె కనిమోళి, కోడలు దుర్గా స్టాలిన్, మనవడు ఉదయ నిధి స్టాలిన్ పాటు పరిశ్రమ ప్రముఖులైన కె.ఎస్.రవికుమార్, శంకర్, విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై సౌందర్య-అశ్విన్ లకు తమ ఆశీస్సులు అందజేశారు.
సౌందర్య సోదరి ఐశ్వర్య కొద్దికాలం క్రితమే హీరో ధనుష్ ను పెళ్లాడింది. సౌందర్య మాత్రం సినీ నేపథ్యం లేని వ్యక్తినే కోరుకోవడంతో చెన్నైకి చెందిన బిజినెస్ మేగ్నెట్ రామ్ కుమార్ తనయుడు అశ్విన్ తో సంబంధాన్ని పెద్దలు ఖాయం చేశారు. సౌందర్య-అశ్విన్ ల వివాహానికి ఇంకా ముహూర్తం నిర్ణయించాల్సి ఉంది. అయితే సౌందర్య మాత్రం తన తండ్రి రజనీకాంత్ ను యానిమేషన్ క్యారెక్టర్ లో చూపిస్తూ ప్రతిష్ఠాత్మకంగా స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న 'సుల్తాన్ ది వారివర్' చిత్రం పూర్తికాగానే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Be first to comment on this News / Article!
|