'మగధీర' సత్యకు సహాయం
'మగధీర' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బి.సత్య కుటుంబానికి దర్శకుల సంఘం చేయూత నివ్వనుంది. సత్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు బి.సాగర్ తెలిపారు. హైద్రాబాద్ లోని సంఘం కార్యాలయంలో సాగర్ తన జన్మదినోత్సవం జరుపుకొన్నారు. ఇందులో దర్శకుల సంఘం నూతన సభ్యులు పాల్గొన్నారు.
సాగర్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే సత్య చనిపోవడం బాధాకరమనీ, చిత్ర ప్రముఖుల నుంచి 5 లక్షల రూపాయలు సేకరించి అతని కుటుంబానికి అందజేస్తామనీ చెప్పారు. దర్శకుల సంఘం సభ్యులందరికీ తాము 24 గంటలూ అందుబాటులో ఉంటామని అన్నారు. సభ్యులు కానివారు ఎవరైనా ఉంటే వారంతా సంఘంలో చేరాలని సూచించారు. మార్చిలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం కార్యదర్శి రాంప్రసాద్, సంయుక్త కార్యదర్శులు వడ్డాణం రమేష్, కె.రంగారావు, కార్యవర్గ సభ్యులు అళహరి, ఎ.ప్రభు, కోటిబాబువై, పి.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|