'రంగ ది దొంగ' ప్రారంభం
శ్రీకాంత్ కథానాయకుడుగా 'రంగ ది దొంగ' అనే కొత్త చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం ప్రారంభమైంది. జి.వి.సుధాకర్ ('హీరో' ఫేమ్) దర్శకుడు. మనోహర్, జివి సుధాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని గోల్డెన్ లయన్, గాడ్ ఫాదర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ పై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి నందమూరి బాలకృష్ణ క్లాప్ ఇవ్వగా, డి.రామానాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. అంబిక కృష్ణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ, జీవి తనకు మంచి మిత్రుడనీ, రెండేళ్ల క్రితమే ఆయన తనకు ఈ స్క్రిప్టు చెప్పినప్పుడు తప్పనిసరిగా చేద్దామని అన్నాననీ తెలిపారు. నటుడుగా అందరికీ సుపరిచితుడైన జీవికి మంచి దర్శకత్వ ప్రతిభ కూడా ఉందనీ అన్నారు. తనకు మంచి మిత్రుడైన మనోహర్ 'మహాత్మ' చిత్రం తర్వాత మళ్లీ తనతో చేస్తున్న రెండో చిత్రమిదని అన్నారు. జీవి మాట్లాడుతూ, ఈ చిత్రంలో శ్రీకాంత్ రంగ పాత్రను, శ్రీహరి దొంగ పాత్రను పోషిస్తున్నారనీ, హీరోయిన్ గా విమలారామన్ ఎంపికైందనీ చెప్పారు. ఈ చిత్రంతో పలువురు టెక్నీషియన్లను పరిచయం చేస్తున్నామని తెలిపారు. ఈనెల 28 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఆగస్టులో రిలీజ్ చేస్తామన్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు నటించనున్నారు. చక్రి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|