'మంచి పాటల బంధువయా'
ఎవరికి ఎవరూ కాని ఈ అనంత విశ్వంలో అందరూ అందరి బంధువులే నంటూ చంద్రసిద్దార్ధ స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం'అందరి బంధువయ'. శర్వానంద్, పద్మప్రియ జంటగా నటించిన ఈ చిత్రాన్ని యుటోపియా ఎంటర్ టైన్ మెంట్స్ అండ్ ఫిల్మోత్మవ్ బ్యానర్ పై రూపొందించారు. అనూప్ సంగీతం అందించిన పాటలు ఇటీవల విడుదలై శ్రోతలను విశేషంగా అలరిస్తున్నట్టు చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
చంద్రసిద్దార్థ మాట్లాడుతూ, ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనీ, ప్రేమకథాంశంతో పాటు చక్కటి సందేశం కూడా ఇందులో ఉంటుందనీ చెప్పారు. ఇందులోని ఆరు పాటలకు చైతన్యప్రసాద్ చక్కటి సాహిత్యం అందించారనీ, అనూప్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలమనీ తెలిపారు. ఆడియో మంచి సక్సెస్ కావడం సినిమా విజయంపై తమ నమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా చంద్రసిద్దార్థ సినిమా అనీ, ఇంతవరకూ తాను నటించిన సినిమాల్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందనీ అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు గర్విస్తున్నానని అన్నారు. రచయిత్రి బలభద్రపాత్రుని రమణి మాట్లాడుతూ, 'మధుమాసం' తర్వాత చంద్రసిద్దార్ధతో చేసిన సినిమా ఇదనీ, ఈ కథను ఆయన మలిచిన తీరు అపూర్వమనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె., నటుడు సురేష్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, రచయిత చైతన్యప్రసాద్, కెమెరామన్ గుమ్మడి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆనంద్, ప్రగతి, విజయ్, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించారు. నాగేందర్ కళాదరశకత్వం, నందమూరి హరి ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|