25 కోట్ల బడ్జెట్ తో 'లవకుశ'
పౌరాణిక ఇతివృత్తాలతో 'హనుమాన్', 'కృష్ణ', 'ఘటోత్కచ' వంటి సక్సెస్ ఫుల్ యానిమేషన్ చిత్రాల తర్వాత ఇప్పుడు 'లవకుశ' యానిమేషన్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2డి యానిమేషన్ గా రూపొందిన ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ ధవళ సత్యం దర్శకత్వం వహించారు. ది కాణిపాకం క్రియేషన్స్ పతాకంపై రాయుడు గ్రూప్ అధినేతల్లో ఒకరైన రాయుడు వి.శశాంక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను యూనిట్ తెలియజేసింది.
నిర్మాత రాయుడు మాట్లాడుతూ, ఇప్పటి వరకూ వివిధ దేశాల్లో వచ్చిన యానిమేషన్ చిత్రాలన్నింటిలోనూ ఇది ఖరీదైన చిత్రమనీ, 25 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని 2డి యానిమేషన్ గా తీశామనీ చెప్పారు. నాలుగున్నర సంవత్సరాల పాటు నాలుగు వందల మంది కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నారు. దవళ సత్యం మాట్లాడుతూ, యానిమేషన్ చిత్రం అనగానే ముందు భయపడ్డాననీ, అయితే నిర్మాణంలోకి దిగాక చాలా ఆనందం కలిగిందనీ చెప్పారు. స్క్రిప్టు వర్క్ కు ఏడాదిన్నర, నిర్మాణానికి మూడేళ్లు పట్టిందని వివిరించారు. ఇతర దేశాలన్నీ తమ తమ కథలతో రజింపజేస్తుంటే మన కథలతో మనం ఎందుకు చేయకూడదని తమకు వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ 'లవకుశ' అనీ చెప్పారు. సమ్మర్ కానుకగా సినిమా రిలీజ్ ఉంటుందన్నారు.
Be first to comment on this News / Article!
|