'7 ప్రేమకథలు' ఆడియో
నవ్యతతో కూడిన ప్రేమకథలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఏడు ప్రేమకథల సమాహారంతో రూపొందిన చిత్రం '7 ప్రేమకథలు'. శియా గౌతమ్ ('నేనింతే' ఫేమ్) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఇనగడప సతీష్ కుమార్ నిర్మించారు. సురేష్ దర్శకుడు. ఏడు కథల్లోని ఓ ప్రేమకథకు పనస రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం కంకీస్ రెస్టారెండ్ లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి ఎన్.శంకర్ కు అందజేశారు. ఆడియో సీడీని కార్పొరేటర్ నీలం రవీందర్ విడుదల చేసి మరో కార్పొరేటర్ అశోక్ గౌడ్ కు అందించారు. రవి పనస ఎడిటర్‌గా 24 క్రాఫ్ట్స్ సినీ టెక్నీషియన్స్ మేగజైన్‌ను దర్శకుడు యన్.శంకర్ ఆవిష్కరించారు.
ఏడు ప్రేమకథలను ఒకే చిత్రంలో చూపించడం ఒక వినూత్న ప్రయోగమనీ, కొత్త తరం చేసిన ఈ మంచి ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాననీ తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఒకే సినిమాలో ఏడు ప్రేమకథలనే కొత్త కాన్సెప్ట్ తో కన్నడంలో పుట్టన్న కనగల్ అనే దర్శకుడు ఓ ప్రయత్నం చేశాడనీ, తెలుగులో చేస్తున్న ఈ ప్రయత్నం సఫలమవ్వాలని కోరుకుంటున్నాననీ శంకర్ అన్నారు. ప్రతి యువతి యువకుల మనోభావలకు దగ్గరగా ఈ ఏడు ప్రేమ కథలు ఉంటాయని నిర్మాత ఇనగడప సతీష్ కుమార్ తెలిపారు.
Be first to comment on this News / Article!
|