నాగచైతన్యతో కామాక్షి మూవీస్
'జోష్' చిత్రంలో సందేశంతో కూడిన యూత్ ఫుల్ పాత్రతో ఆకట్టుకున్న నాగచైతన్య తాజాగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో 'ఏమాయ చేసావె' అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ద్వారా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన మూడో చిత్రానికి కూడా రంగం సిద్ధమైంది. నాగార్జునతో పలు హిట్ చిత్రాలు రూపొందించి ఇటీవల 'కేడి' చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన డి.శివప్రసాద్ రెడ్డి తాజాగా కామాక్షి కళా మూవీస్ పతాకంపై నాగచైతన్యతో ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా అజయ్ భూయాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం గురించి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కామాక్షి బేనర్ సిల్వర్ జూబ్లీ ఇయర్ లో నాగచైతన్య హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు హ్యాపీగా ఉందనీ, నాగచైతన్యకు జోడిగా కాజల్ నటించనుందనీ తెలిపారు. తమ సంస్థలో ఇంతవరకూ వచ్చిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే ఇది మరో ఎత్తు అవుతుందనీ, భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తామనీ తెలిపారు. ఇందుకోసం అద్భుతమైన సబ్జెక్ట్ కూడా రెడీ అయిందని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం లొకేషన్లు సెలక్ట్ చేయడానికి దర్శకుడు అజయ్ భూయాన్ అమెరికా వెళ్లినట్టు తెలిపారు. మార్చిలో షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్ నుండి నాన్ స్టాప్ షెడ్యూల్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి వి.ఎస్.జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|