'ఆకాశరామన్న' వస్తున్నాడు
అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, మీరాజాస్మిన్, గౌరీపండిట్ ప్రధాన పాత్రల్లో మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మించిన వైవిధ్య భరిత చిత్రం 'ఆకాశరామన్న'. అశోక్ దర్శకుడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటూ విడుదలకు సిద్ధమవుతోంది.
మన్యం రమేష్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ, విభిన్న తరహా కథ-కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామనీ, పూర్తి వినోదాత్మకంగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం అలరిస్తుందనీ చెప్పారు. అల్లరి నరేష్ 'గమ్యం' తర్వాత మళ్లీ అలాంటి ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ను ఇందులో చేశారనీ, శివాజీ, రాజీవ్ కనకాల పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందనీ చెప్పారు. ఇందులో 'ఆకాశరామన్న' ఎవరనేది తెరపై చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుందన్నారు. ఇది థ్రిల్లర్ కానప్పటికీ చాలా మంచి సస్పెన్స్ ఉంటుందనీ, ఈ చిత్రాన్ని ప్రేక్షకుడు పది నిమిషాలూ కూడా మిస్ కాకుండా చూడాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ మిస్ అయితే మళ్లీ కథలోకి రావడానికి టైమ్ పడుతుందనీ అన్నారు. కథలో ఎక్కువ భాగం రాత్రి వేళలోనే జరుగుతుందని చెప్పారు. మార్చి మొదటి వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగబాబు, మధుశర్మ, వేణుమాధవ్, రావు రమేష్, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించారు. చక్రి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|