పెళ్లికి తీరిక లేదు: భావన
కేరళ నాయిర్ ఫ్యామిలీలో పుట్టిన భావన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నితిన్ సరసన 'హీరో', గోపీచంద్ తో 'ఒంటరి', శ్రీకాంత్ జోడిగా 'మహాత్మ' చిత్రాల్లో భావన నటించింది. అందం, అభినయం పుష్కలంగా ఉన్న భావన తమిళంలో తొలిసారి కమల్ 'నమ్మల్' చిత్రంలో నటించింది. ఆ తరువాత పలు తమిళ, మలయాళ నటించింది. రెండు సార్లు కేరళ స్టేట్ అవార్డులు కూడా ఆమెను వరించాయి. ఇటీవల ఆమె హీరో అజిత్ కు జోడిగా నటించిన తమిళ 'అసల్' కూడా సక్సెస్ అయింది. కెరీర్ మంచి ఊపులో ఉన్న తరుణంలో భావన పెళ్లి చేసుకోబోతోందనీ, సరైన వరుడి కోసం ఆమె తల్లిదండ్రులు అన్వేషిస్తున్నారంటూ ఇటీవల పలు ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిని భావన తన తాజా ఇంటర్వ్యూలో నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
'నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన కూడా లేదు. నటిగా మంచి ఆఫర్లు వస్తున్నాయి. సరైన స్క్రిప్టు కోసం చూస్తున్నాను. తమిళంలో అసల్ సక్సెస్ తర్వాత మరో సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం అది ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది కన్నడ పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతున్నాను. సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో జాకీ అనే చిత్రంలో నటిస్తున్నాను' అని భావన తన వరుస ప్రాజెక్ట్ ల గురించి చెప్పుకొచ్చింది.
Be first to comment on this News / Article!
|