ఇలియానా ఉన్నట్టా? లేనట్టా?
'కిక్' సక్సెస్ తర్వాత ఇలియానా 'సలీమ్', 'రెచ్చిపో' వంటి రెండు ఫ్లాపులు చవిచూసింది. ఈ ఫెయిల్యూర్ల ప్రభావం ఆమెపై లేదని అంటున్నప్పటికీ ఒక సక్సెస్ మాత్రం ఆమెకు అనివార్యమవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'శక్తి' చిత్రంలో నటిస్తూ...రామ్ సరసన 'టామ్ అండ్ జెరీ' చిత్రానికి కూడా కమిట్ అయింది. పనిలో పనిగా చాలా కాలం తర్వాత ఆమె తమిళంలో స్టార్ హీరో విక్రమ్ సరసన '24' అనే చిత్రానికి కమిట్ అయింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సైతం నిలిచిపోవడం ఇలియానాను డైలమాలో పడేసినట్టు చెబుతున్నారు.
'24' చిత్ర కథ విషయంలో సూచించిన దర్శకుడు సూచించిన కొన్ని మార్పులకు హీరో విక్రమ్, నిర్మాత మోహన్ నటరాజ్ ఒప్పుకోకపోవడంతో ఆ చిత్రం ఆదిలోనే నిలిచిపోయింది. విక్రమ్ ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారు. అయితే మోహన్ నటరాజ్ మాత్రం విక్రమ్ డేట్స్ తన వద్ద ఉండటంతో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా భూపతి పాండియన్ అనే దర్శకుడికి ఎంపిక చేసి వేరే కథతో సినిమాను సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ ప్యాక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. విక్రమ్ పోలీసు అధికారి పాత్రను పోషించబోతున్నారు. మరి ఇలియానా ఇందులో కంటిన్యూ అవుతుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈమధ్యనే ఇలియానాతో '24' చిత్రం గురించి ప్రస్తావించినప్పుడు 'తమిళ కేడి చిత్రం తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే ఇన్నాళ్లకు నన్ను ఎగ్జయిట్ చేయగలిగే సబ్జెక్ట్ దొరకడంతో విక్రమ్ తో నటించే సినిమా అంగీకరించాను. ఇదో ఫాంటసీ చిత్రం. ఇంతవరకూ నేను అలాంటి చిత్రం చేయలేదు' అంటూ సంబరంగా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఫాంటసీ స్టోరీ బదులు పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ వచ్చి చేరింది. దర్శకుడు కూడా మారిపోయాడు. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ప్లేస్ లో దేవీశ్రీ ప్రసాద్ కూడా వచ్చిచేరారు. ఇన్ని మార్పుల తర్వాత ఇలియానా
సైతం ఈ ప్రాజెక్ట్ కు ముఖం చాటేస్తుందా? ఎలాగూ డేట్లు ఇచ్చాం కాబట్టి ఎడ్జెస్ట్ అయిపోదామని అనుకుంటుందా? అనేది చూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|