'సాధ్యం' మార్చి 5కు వాయిదా
'పెళ్లయిన కొత్తలో', 'ప్రవరాఖ్యుడు' చిత్రాలతో హాట్ పెయిర్ అనిపించుకున్న జగపతిబాబు, ప్రియమణి ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాధ్యం'. ఇప్పటికే వర్కింగ్ స్టిల్స్ పరంగా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం విడుదలపరంగానూ మరోసారి క్యూరియాసిటీ పెంచుతూ వాయిదా పడింది. ఈనెల 26న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా తాజాగా మార్చి 5వ తేదీకి ఈ చిత్రం వాయిదా పడింది. 26న తేదీన ఇబ్బడిముబ్బడిగా సినిమాలు విడుదలవుతుండటంతో దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో కుమార్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరికొత్త స్క్రీన్ ప్లేతో 'సాధ్యం' రూపొందిందనీ, జగపతిబాబు పాత్రతో పాటు ప్రియమణి పాత్ర చాలా హైలైట్ గా ఉంటుందని కుమార్ బ్రదర్స్ చెబుతున్నారు. గాయం, అంత:పురం చిత్రాలకు మించిన పవర్ ఫుల్ పాత్రను జగపతిబాబు ఇందులో పోషించగా, ప్రియమణి ఇంతవరకూ చేయని పాత్రను ఇందులో పోషించింది. మరో కీలక పాత్రలో కీర్తిచావ్ల. ఇతర పాత్రల్లో కోట, తనికెళ్ల భరణి, యుబి రాజు, సత్యప్రకాష్ నటించారు. శ్యామ్ మనోహర్ కథ-స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి శ్యామ్-మడూరి మధు మాటలు, గౌతంరాజు ఎడిటింగ్, చిన్నిచరణ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|