'పోలీస్ పోలీస్'కు మోక్షం
శ్రీరామ్, పృధ్వీరాజ్ హీరోలుగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన 'పోలీస్ పోలీస్' చిత్రం కొద్దికాలం క్రితమే నిర్మాణం పూర్తి చేసుకున్నా కారణాంతరాల వల్ల విడుదలలో జాప్యం తలెత్తింది. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. పినాకిల్ పిక్చర్స్ పతాకంపై చందు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా మన్మోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని నట్టికుమార్ రిలీజ్ చేస్తున్నారు
వాస్తవ సంఘటనల స్ఫూర్తితో పోలీసు డిపార్ట్ మెంట్ లోని మంచి చెడ్డల విశ్లేషణతో ఈ చిత్రం తెరెకెక్కింది. నిజాయితీ గల పోలీసు అధికారిగా శ్రీరామ్, అవినీతికి కొమ్ముకాసే పోలీసు అధికారిగా పృధ్వీరాజ్ ఇందులో నటించారు. కమలిని ముఖర్జీ, సంజన హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మాజీ, దండపాణి, విక్రమ్, ఆహుతి ప్రసాద్, ప్రసాద్ బాబు ఇతర పాత్రలు పోషించారు. కథ-స్క్రీన్ ప్లే సైతం మనోహ్మన్ అందించిన ఈ చిత్రానికి భరణి ఎస్ ధరణి సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సాయికార్తీక్-విశ్వ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|