'ఓవర్ ఎక్స్ పోజింగ్ పొరపాటే'
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న గ్లామర్ నటి ఛార్మి ఇప్పుడు తమిళంలోనూ ఇదే తరహాలో ఇమేజ్ మార్పు కోసం పట్టుదలగా ఉంది. ఇటీవల తమిళంలో 'లాడమ్' వంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించిన ఛార్మి ఇక నుంచి మంచి మార్కెట్ ఉన్న స్టార్స్ తోనే నటించాలనుకుంటోందట. తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కావనీ, తెలుగులో సూపర్ స్టార్ట్ తో పనిచేసే హీరోయిన్లు ఆల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తేనే ఆ సినిమాలు వర్కవుట్ అవుతాయనీ తనకున్న అనుభవంతో ఛార్మి విశ్లేషించి చెబుతోంది. ప్రస్తుతం మలయాళంలో 3, కన్నడంలో ఒక చిత్రంలో ఛార్మి నటిస్తోంది. ఈ మూడింట్లోనూ టాప్ స్టార్స్ తోనే ఛార్మి నటిస్తుండటం విశేషం. ఇంతవరకూ గ్లామర్ తో పాటు పెర్ ఫారమెన్స్ కు ఆస్కారం ఉన్న చిత్రాల్లో తాను నటించినప్పటికీ 'ఓవర్ ఎక్స్ పోజింగ్' చేయడం పొరపాటేనని, ఇందుకు తన ఇన్సోసెన్స్ (అమాయకత్వం) కూడా కారణమని చెబుతోంది.
'పరిధులు దాటి ఎక్స్ పోజింగ్ చేయడం నేను చేసిన పొరపాటే. పదమూడేళ్లకే పరిశ్రమలోకి రావడంతో అమాయకత్వం కూడా తోడయింది. చాలానే ఎక్స్ పోజింగ్ చేశాను. ఆలా చేయకుండా ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది' అని ఛార్మి ఓ తాజా ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేసింది. ఇందుకు ఓ ఉదాహరణకు కూడా చెప్పుకొచ్చింది. ఛార్మి ఓ సినిమా చేస్తున్నప్పుడు ఓ స్టిల్ ఫోటోగ్రాఫర్ అక్కడున్న చెట్టు ఎక్కి టాప్ ఏంగిల్ షాట్ ను ఛార్మికి తెలియకుండానే తీశాడట. ఛార్మి 'క్లీవేజ్' షో కొట్టొచ్చినట్టు కనిపించే ఆ ఫోటోలనే పబ్లిసిటీ పోస్టర్లుగా ఆ తర్వాత హైలైట్ చేశారు. స్కిన్ షో అనేది కెమెరా యాంగిల్స్ ను బట్టే ఉంటుందనీ, మనం దర్శకుడిని నమ్మినప్పుడు ఆయన ఎంతో కళాత్మకంగా వాటిని తీయవచ్చనీ, అలా చేయనప్పుడు అది వల్గారిటీకి దారితీస్తుందనేది అనుభవంలో తెలుసుకున్నాననీ ఛార్మి తెలిపింది. మొత్తానికి ఇటీవల వచ్చిన రెండు మూడు ఫెయిల్యూర్ల ప్రభావం ఛార్మి అంతర్మథనానికి కారణం అనుకోవచ్చు.
Be first to comment on this News / Article!
|