మార్చి 12న 'కిరణ్ బేడి'
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మాలాశ్రీ చాలాకాలం క్రితమే కన్నడంలో స్థిరపడింది. కెరీర్ పరంగా కొంత గ్యాప్ తరువాత ఆమె నటించిన యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం 'కిరణ్ బేడి'. కన్నడంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని రాము ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నిర్మాత రాము తెలుగులోకి అనువదించారు. యస్.ఓంప్రకాష్ రావు దర్శకుడు. ఉగాది కానుగా మార్చి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
కన్నడంలో ఈ చిత్రం 16 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని పెద్ద సక్సెస్ సాధించిందనీ, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం బాగా నచ్చుతుందనీ ఆయన అన్నారు. ఇందులో మాలాశ్రీ ఆరు అద్భుతమైన పైట్స్ చేసిందనీ, ఇవన్నీ డూప్ లేకుండా చేయడం విశేషమనీ చెప్పారు. హంసలేక సంగీతం సమకూర్చిన ఆరు పాటలు వీనులవిందుగా ఉంటాయన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అశిష్ విద్యార్థి, జీవి, పి.డి.రాజు, మహేష్, పార్ధసారధి, శివపార్వతి, తెలంగాణ శకుంతల, శ్రీనివాసమూర్తి, బుల్లెట్ ప్రకాష్ తదితరులు నటించారు. వెన్నెలకంటి మాటలు, విష్ణువర్దన్ సినిమాటోగ్రఫీ, లక్ష్మణ్ రెడ్డి ఎడిటింగ్, పళనిరాజు ఫైట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|