రాజశేఖరా మోజు తీరలేదురా!
శేఖర్ కమ్ముల సినిమాల్లో ఐటెం సాంగా? అందులోనూ సీరియస్ పొలిటికల్ ఫిల్మ్ లో సాంగేమిటి? అనుకున్న వాళ్లు సైతం ఇప్పుడు ఆయన తీసిన 'లీడర్' చిత్రంలోని ఐటెం సాంగ్ కు మెస్మరైజ్ అవుతున్నారు. బెంగాలీ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ, మరో బ్యూటీ ప్రియా ఆనంద్ ఉన్నప్పటికీ మన తెలుగు బ్యూటీ ఉదయభాను కేవలం ఓ ఐటెంతో ప్రేక్షకుల కన్ను చెదరగొట్టింది. సినిమా ప్రధమార్థంలో వచ్చే ఓ పార్టీ ఈవెంట్ లో 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అంటూ ఉదయభాను ఈ పాట అందుకుంటుంది. ఇందులో ఉదయభాను చేత వేయించిన స్పెప్స్, ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ ఐశ్వర్యారాయ్ 'కజ్రాజే...'ను తలపించినట్టు ప్రేక్షకుల ప్రశంసలు కూడా ఆమెకు దక్కుతున్నాయి.
ఈ పాటలో ఉదయ భాను చేసిన ఆడనెమలి డాన్స్ కాన్సెప్ట్ ఆమెదేనట. ఆమె ఆలోచనకు కొరియోగ్రాఫర్, ఆతర్వాత కళాదర్శకుడు మరింత మెరుగులు పెట్టారట. అంతేకాదు. ఈ పాటలో ఆమె కట్టుకుని ఓ శారీ బరువు అక్షరాలా 25 కేజీలట. ఇక ఉదయభాను చేసిన 'హిప్' మూమెంట్ అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసి శభాష్ అనిపించుకుందట. ఉదయభాను పడిన శ్రమకు ఇప్పుడు 'లీడర్' ప్రదర్శిస్తున్న హాళ్లల్లో చప్పట్లు కూడా పడుతున్నాయి. ఇదే ఊపులో ఉదయభాను మరిన్ని ఐటెం సాంగ్ లు సునాయాసంగా లాంగిచ్చేయెచ్చు.
Be first to comment on this News / Article!
|