కల నిజమైంది: నాగచైతన్య
'జోష్' చిత్రంతో తొలి అడుగు వేసిన నాగచైతన్య తన మలి చిత్రం 'ఏ మాయ చేసావె'తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు రెడీ అయ్యారు. అద్భుతమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో నటించాలనే తన కల ఈ చిత్రంతో నిజమైందని నాగచైతన్య అంటున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలు, తన అంచనాలు, భవిష్యత్ ప్రణాళిక గురించి నాగచైతన్యతో జరిపిన ముఖాముఖి...
'గీతాంజలి'లా...
'జోష్' తర్వాత ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా ఓ సినిమా చేద్దామని అనుకుంటున్న తరుణంలో 'ఏమాయ చేసావె' చిత్రం నా ముందుకు వచ్చింది. స్క్రిప్టు చాలా బాగుంది. ఇలాంటి అద్భుతమైన ప్రేమకథ వచ్చి చాలా రోజులైందని అనిపించింది. నాన్నగారికి 'గీతాంజలి'లా మంచి ఫీల్ ఉన్న చిత్రమిది. గౌతమ్ మీనన్ లాంటి అద్భుతమైన టెక్నీషియన్ దర్శకత్వం వహించడం, ఆస్కార్, గ్రామీ అవార్డుల అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం, అలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి మంచి ఆఫర్ ఇచ్చిన ఇందిరా ప్రొడక్షన్స్ కు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను.
అసిస్టెంట్ డెరెక్టర్ కార్తీక్
ఇందులో నా పేరు కార్తీక్. ఇంజనీరింగ్ చదవి సినిమాల పట్ల అభిరుచితో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ ఫీల్డ్ లోకి అడుగుపెడతాను. ఐటి కంపెనీలో పనిచేసే పక్కింటి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల చుట్టూ కథ తిరుగుతుంటుంది. హీరోయిన్ సమంత చాలా బాగా నటించింది. మా ఇద్దరి మధ్య స్క్రీన్ కెమెస్ట్రీ కూడా బాగా పండింది.
గౌతమ్ ది గ్రేట్...
గౌతమ్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు నేను చూశాను. ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక నాకు ఉండేది. అది
నా రెండవ చిత్రంతోనే నెరవేరింది. చక్కటి టెక్నికల్ విలువలతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఒక ఆర్టిస్టుగా నాకు కావాలసినంత స్వేచ్ఛ ఇచ్చి తనకు కావాల్సిన నటనను రాబట్టుకున్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|