కల నిజమైంది: నాగచైతన్య
పాటలు...స్లోపాయిజన్
రెహమాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని నా అభిప్రాయం. ఆయన సంగీత దర్శకత్వంలో పనిచేయడం అనిర్వచనీయమైన అనుభూతినిచ్చింది. పాటలు మెలోడి ప్రధానంగా..నిదానంగా ఉన్నప్పటికీ స్లో పాయిజన్ లా ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆడియోకి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని 3 పాటలు న్యూయార్క్ లో, ఒక పాట హైద్రాబాద్ లోని సెట్ లో, మిగిలిన పాటలు చెన్నైలోని వివిధ లొకేషన్లలో తీశారు. పాటలన్నీ చిత్రీకరణ పరంగా కనులవిందు చేయడం ఖాయం.
అందరికీ సస్పెన్సే...
సినిమా ఎలా ఉందనే ఉత్సుకత అందరిలోనూ ఉంది. నాతో సహా నా కుటుంబ సభ్యులెవరూ ఇంకా సినిమాను చూడలేదు. డబ్బింగ్ రూమ్ లో మాత్రమే నేను చూశాను. సినిమా సక్సెస్ మీద మాత్రం నాకు గట్టి నమ్మకం ఉంది.
నటనకు మార్కులేశారు...
నటుడిగా ఇది నా రొండో అడుగు. 'జోష్' ఆశించిన ఫలితం ఇవ్వకపోయి ఉండొచ్చు. అయితే నా నటన బాగుందని మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో సక్సెస్, మరింత మంచి నటుడిగా గుర్తింపు వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాను.
ఏడాదికి రెండు చిత్రాలు...
కెరీర్ ను ఓ ప్రణాళికతో ముందుకు తీసుకు వెళ్లాలని అనుకుంటున్నాను. ఏడాదికి కనీసం రెండు చిత్రాలు తప్పనిసరిగా చేయాలనుకుంటున్నాను. ఇందులో భాగంగానే కామాక్షి కళామూవీస్ లో నా తదుపరి చిత్రం ఉంటుంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|