రంభ...సరస్వతి
ఆర్టిస్టులు ఎన్ని గ్లామరస్ పాత్రలు చేసినా అరుదుగా మాత్రమే పౌరాణిక పాత్రలు వస్తుంటాయి. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి వివాహానంతరం మళ్లీ టాలీవుడ్ లో సెకెండ్ ఇన్సింగ్స్ లోకి అడుగుపెట్టిన ఆర్తి అగర్వాల్, వివాహం తర్వాత అడపా దడపా మాత్రమే నటిస్తున్న నటి కల్యాణి ఇప్పుడు అలాంటి అపురూప పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. 'బ్రహ్మలోకం టు యమలోకం' (వయా భూలోకం) అనే చిత్రంలో రంభగా ఆర్తి అగర్వాల్, సరస్వతీ దేవిగా కల్యాణి నటిస్తున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోళ్లపాటి నాగశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, శివాజీ హీరోలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలోని సరస్వతి దేవి పాత్ర కోసం కల్యాణి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తన సెకెండ్ ఇన్నింగ్స్ కు రంభ పాత్ర ఎంతో ఉపకరిస్తుందని ఆర్తి ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇందులో ప్రధాన హీరోయిన్ గా సోనియా ('వినాయకుడు'ఫేమ్) నటిస్తోంది. హైద్రాబాద్, కేరళ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. ఇంతవరకూ 90 శాతం షూటింగ్ పూర్తయిందనీ, ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్స్ట్ కు మంచి ప్రాధాన్యం ఉంటుందనీ దర్శక నిర్మాతలు చెబుతున్నారు. పరిశ్రమలోని ప్రముఖ హాస్యనటులంతా నటిస్తున్న ఈ చిత్రానికి భాస్కరభట్ల పాటలు, వాసు సినిమాటోగ్రఫీ, నాగిరెడ్డి ఎడిటింగ్, ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|