హాలీవుడ్ కు విమలారామన్
దక్షిణాది భాషా చిత్రాల్లో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటున్న విమలారామన్ కు ఇప్పుడు ఎకాఎకిన హాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టింది.
శ్రియ తర్వాత దక్షిణాది నుంచి విమలారామన్ కు ఈ హాలీవుడ్ ఆఫర్ దక్కడం విశేషం. మలయాళ, తమిళ చిత్రాల్లో ఇప్పటికే తన ఉనికిని చాటుకున్న విమలారామన్ 'ఎవరైనా ఎపుడైనా' చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆ చిత్రం ఫ్లాపు అయినప్పటికీ తరుణ్ సరనస 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది. ఆ చిత్రం ఇంకా విడుదల కానప్పటికీ ఇందులో ఆమె బికినీలో అందాలను ఆలవోకగా ఆరబోసిన పబ్లిసిటీ స్టిల్స్ మరో రెండు కొత్త ఆఫర్లు తెచ్చిపెట్టాయి. జగపతిబాబు కథానాయకుడుగా ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న 'గాయం 2', శ్రీకాంత్ హీరోగా జీవి దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైన 'రంగ ది దొంగ' చిత్రాల్లో విమలారామన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఊహించని విధంగా ఇప్పుడు విమలకు 'డేమ్ 999' అనే ఆంగ్ల చిత్రంలో నటించే అవకాశం వరించింది.
పలువురు ఎన్ఆర్ఐ నిర్మాతలు కలిసి 'డేమ్ 999' చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో హాలీవుడ్ తారలతో పాటు హిందీ, మలయాళ తారలు కూడా నటించనున్నారు. విమలారామన్ ఓ ఇంగ్లీషు కుర్రాడితో ప్రేమలో పడే మలయాళీ అమ్మాయి పాత్రను పోషించనుంది. 'వాన' ఫేమ్ వినయ్ సైతం ఇందులో నటించనున్నారు. మార్చి 1న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.
Be first to comment on this News / Article!
|