150 ప్రింట్లతో శ్రీహరి 'దాసన్నా'
రియల్ స్టార్ శ్రీహరి కథానాయకుడుగా విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మిస్తున్న చిత్రం 'దాసన్నా'. డి.ఎస్.పి. దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని డిటిఎస్ మిక్సింగ్ జరుపుకొంటోంది. శ్రీహరి సరసన మీనా కథానాయికగా నటించింది. ఈ చిత్రం ట్రైలర్స్ ను హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారంనాడు జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
శ్రీహరి మాట్లాడుతూ, ఇదొక చక్కటి మాస్ చిత్రమనీ, 'భద్రాచలం' తర్వాత తనకు అంతటి మంచిపేరు తెచ్చే చిత్రమవుతుందని అన్నారు. నిర్మాత నట్టికుమార్ 150 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారనీ, తన చిత్రం ఇన్ని ప్రింట్లతో విడుదల కానుండటం ఇదే మొదటిసారనీ అన్నారు. చాలకుడి కొండ దిగువ ప్రాంతంలో యూనిట్ అంతా ఎంతో శ్రమపడి ఈ చిత్రం షూటింగ్ చేశామని, ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని సక్సెస్ చేస్తారనే నమ్మకం తనకుందనీ అన్నారు. శ్రీహరి నుంచి ప్రేక్షకాభిమానులు ఎలాంటి సినిమాను ఆశిస్తారో అలాంటి హంగులన్నీ ఈ చిత్రంలో ఉన్నాయని నట్టికుమార్ తెలిపారు. మార్చి మొదటివారంలో ఆడియో, అదేనెల 12వ తేదీన సినిమా విడుదల చేస్తామని అన్నారు. సంగీత దర్శకురాలు శ్రీలేఖ మట్లాడుతూ, ఇందులోని పాటలన్నీ ప్రేక్షకులను అలరిస్తాయనీ, రీరికార్డింగ్ కు మంచి ప్రాధాన్యం ఉందనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, పోసాని కృష్ణమురళి, ఏవియస్, చంద్రమోహన్, గౌతంరాజు, రాజారవీంద్ర, కల్పన, కృష్ణవేణి, బాబిలోనా, అల్ఫానా తదితరులు నటించారు. పోసాని కథ-మాటలు, శంకర్ కె. సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|