'సూపర్ కౌబాయ్'గా లారెన్స్
నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ హీరోగా 20 కోట్ల రూపాలయ భారీ బడ్జెట్ తో 'సూపర్ కౌబాయ్' చిత్రం రూపొందుతోంది. ఎజిఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై కల్పాతి ఎస్.అగోరం, కల్పాతి ఎస్.రమేష్, కల్పాతి ఎస్.గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శింబుదేవన్ దర్శకుడు.
చిత్ర విశేషాలను దర్శకుడు శింబుదేవన్ తొలిసారి తెలియజేస్తూ, 18వ శాతాబ్దానికి చెందిన కథను తీసుకుని కామెడీ అడ్వెంచర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్నారు. రెడ్ ఇండియన్స్ గురించి ఇంతవరకూ ఎవరూ చూపని విధంగా ఇందులో చూపిస్తున్నామనీ, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ సెట్ గా 300 మంది వర్కర్స్ తో కేరళో ఓ సెట్ వేశామని చెప్పారు. తెన్ కాశి, తడ, మధ్యప్రదేశ్, రాయచోటి, సాతునూర్, బెంగుళూర్, పుణె, నాగపూర్, పాల్ఘాట్, అంబసముద్రం, పాండిచ్చిరిలలో షూటింగ్ చేశామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న విజయనగర సామ్రాజ్యపు కందికోట కెనాల్ లో తొలిసారిగా షూటింగ్ చేసిన చిత్రం ఇదేనని చెప్పారు. రోజూ 20 కిలోమీటర్ల ప్రయాణించి వెళ్లి, 30 అడుగులు లోతు కలిగిన కెనాల్ లో చాలా రిస్కీ షాట్స్ తీశామని చెప్పారు. అలాగే నటీనటులందరికీ హార్స్ రైడింగ్ లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. మార్చిలో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందని రాఘవ లారెన్స్ తెలిపారు. చాలా లావిష్ గా ఈ చిత్రాన్ని ఎజిఎస్ సంస్థ నిర్మిస్తోందని అన్నారు. లారెన్స్ సరసన పద్మప్రియ, లక్ష్మీరాయ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సాయికుమార్, సంధ్య, నాజర్, మనోరమ, సెంథిల్, మౌళి, ఢిల్లీ రాజేష్, రమేష్ ఖన్నా తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే సైతం శింబుదేవన్ అందించిన ఈ చిత్రానికి శ్రీరామకృష్ణ మాటలు, వనమాలి పాటలు, జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|