నాగచైతన్య-సమంత లిప్ కిస్!
నాగచైతన్య తొలి చిత్రం 'జోష్' పై అంచనాలు ఎక్కువ ఉండటం వల్ల ఆ సినిమా అనుకున్న రీతిలో ఆడలేదనీ, అయితే రెండో చిత్రం 'ఏమాయ చేసావె' ఒక రొమాంటిక్ ఫెంటాస్టిక్ మూవీని చూసిన అనుభూతి కలిగిస్తుందనీ నాగచైతన్య తరఫున నాగార్జున భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ప్యూర్ లవ్ స్టోరీగా మాత్రమే దీనిని చూడాలని కూడా ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న విడుదలవుతున్న ఈ చిత్రంపై సహజంగానే కొన్ని ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించడం, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీత దర్శకుడు కావడం వంటివి ఈ అంచనాలకు కారణాలు. వీటికితోడు చిత్ర కథ విషయంలో ఆసక్తి కరమైన కథనాలు కూడా వినిపిస్తున్నాయి.
నాగచైతన్య ఈ చిత్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని సినీ ఇండస్ట్రీపై మక్కువతో దర్శకుడు కావాలనుకుంటాడు. పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరుతాడు. ఇదే క్రమంలో ఐటి కంపెనీలో పనిచేసే తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడం, ఆ అమ్మాయి (సమంత) నాగచైతన్య కంటే రెండేళ్ల పెద్దది కావడంతో పెద్దల్నించి అభ్యంతరాలు వ్యక్తమవుతాయట. 'ఏమాయ చేసావె' అంటూ నాగచైతన్య ఆమె ప్రేమ కోసం ఎలా తపించాడు? చివరికి ఈ ప్రేమ కథ సుఖాంతమైందా అనేవి సస్పెన్స్ లో ఉంచారు. ఆసక్తికరంగా ఇందులో నాగచైతన్య, కథానాయిక సమంత మధ్య ఓ సుదీర్ఘమైన 'లిప్ లాక్' సన్నివేశాన్ని కూడా దర్శకుడు గౌతమ్ చిత్రీకరించారట. కథకు ఈ సన్నివేశం కీలకం కావడంతో తెరపై కూడా ఈ సన్నివేశం ఉండబోతోంది. అయితే ఈ సన్నివేశం నిడివిని మాత్రం సెన్సార్ కుదించింది. ఇదే చిత్రం తమిళంలో త్రిష-శింబులతో 'విన్నైతాండి వరువాయ'గా గౌతమ్ తీసి విడుదల చేస్తున్నారు. ఇందులోనూ త్రిష, శింబు మధ్య లిప్ కిస్ సన్నివేశం ఉండటంతో సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ మాటెలా ఉన్నా తెలుగు వెర్షన్ లో నాగచైతన్య 'లిపికిస్' యూత్ లో ఎలాంటి కలకలం సృష్టిస్తుంనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది
Be first to comment on this News / Article!
|