'మాయాబజార్' బ్లూ-రే డిస్క్
విజయవారి క్లాసిక్ 'మాయాబజార్'కు రంగులు అద్ది సినిమా స్కోప్, డిటిఎస్ హంగులతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెచ్చిన గోల్డ్ స్టోన్ సంస్థ తొలి ప్రయత్నం సకెస్స్ కావడంతో మరిన్ని విజయా బ్యానర్ చిత్రాల వైపు ప్రస్తుతం దృష్టి మళ్లిస్తోంది. 13 చిత్రాల రైట్స్ ను కూడా కొనుగోలు చేసింది. తాజాగా రంగుల 'మాయాబజార్' చిత్రం మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తూ ఎప్పుడెప్పుడు డివిడి విడుదవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది. ఇందుకు అనుగుణంగా కలర్ 'మాయాబజార్'ను బ్లూ-రే డిస్క్ గా విడుదల చేసేందుకు గోల్డ్ స్టోన్ సిఇవో జగన్మోహన్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి తెలుగులో తొలి కలర్ చిత్రం క్రెడిట్ ను దక్కించుకున్న ఈ చిత్రాన్ని బ్లూ-రే డిస్క్ రూపంలో విడుదల చేసి ఈ ఫార్మెట్ లో విడుదల చేసిన తొలి చిత్రం క్రిడిట్ కూడా దక్కించుకోవాలని గోల్డ్ స్టోన్ ఆలోచన చేసినట్టు సమాచారం. అయితే సినిమా ఇటీవలే విడుదల కావడం, థియేటర్లరో ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్న నేపథ్యంలో కొద్దిరోజుల అనంతరం బ్లూ-రే డిస్క్ లను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.
మరోవైపు బ్లూ-రే డిస్క్ ఫార్మెట్ లో 'మగధీర' చిత్రాన్ని గీతా ఆర్ట్స్, బాలాజీ ఫిలిమ్స్ తో సంయుక్తంగా మార్చిలో విడుదల చేయబోతున్నారు. అనంతరం కలర్ 'మాయాబజార్' బ్లూ-రే డిస్క్ లు విడుదలవుతాయి. ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా వీటిని అందుబాటులోకి తేచ్చేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
Be first to comment on this News / Article!
|