నాగ్ ఛలో కేరళ...
నాగార్జున 'కేడి' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి 'కింగ్' తర్వాత ఏడాది గ్యాప్ రావడం నాగార్జున కెరీర్ లో ఇదే మొదటిసారి. మళ్లీ ఇలాంటి గ్యాప్ రాకుండా నాగార్జున తన తదుపరి చిత్రాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నాగార్జున తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం కేరళ బయలుదేరి వెళ్లారు. గురువారం నుంచి ఆయన కొత్త చిత్రం షూటింగ్ అక్కడ మొదలైంది. రాధామోహన్ ('ఆకాశమంత' ఫేమ్) దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'పయనం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరో టైటిల్ గా 'వాంటెడ్' పేరు కూడా ప్రచారంలో ఉంది.
ఇండియన్ ఫ్లైట్ ను తాలిబన్లు హాజైక్ చేసి కాందహార్ తరలించే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. విమానాశ్రయంలోనే కథ ఎక్కువగా నడుస్తుందనీ, నాగ్ ఇంతవరకూ చేయనటువంటి పవర్ ఫుల్ పాత్రను ఇందులో పోషిస్తున్నారనీ తెలుస్తోంది. మరో కీలక పాత్రను ప్రకాష్ రాజ్ పోషించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు. తమిళ వెర్షన్ కు ప్రకాష్ రాజ్ నిర్మాత కూడా. నాగార్జున సక్సెస్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రం తర్వాత వీరుపోట్ల ('బిందాస్' ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Be first to comment on this News / Article!
|