ఓ ఇంటిదైన మమత
మలయాళం నుంచి తెలుగులోకి అడుగుపెట్టి తన గ్లామర్ తో, గాత్రంతో మెస్మరైజ్ చేస్తున్న మమతా మోహన్ దాస్ ఎట్టకేలకు ఓ ఇంటిదైంది.అలాగని ఏవో ఊహించుకోనవసరం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఓ సొంత ఇంటికి ఓనరైందంతే. అది కూడా హైద్రాబాద్ లోనో, చెన్నై, కేరళలోనే కాదు. బహ్రెయిన్ లో. ప్రస్తుతం కొత్తగా కొన్న ఫ్లాట్ లోని బాల్కనీ నుంచి సిటీ శోభలను తిలకిస్తూ ఆనంద డోలికల్లో తేలియాడుతోందట.
కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఎక్కడో బహ్రెయిన్ లోనే ఫ్లాట్ ఎందుకు కొనాలనే సందేహం అందరికీ సహజమే. మమత పుట్టింది కేరళలో అయినా ఐలాండ్ కంట్రీ బహ్రెయిన్ లో పెరిగింది. దాంతో ఆమె ఫేవరెట్ ప్లేస్ కూడా అదే అయింది. అక్కడ్నించే నేరుగా మలయాళ పరిశ్రమలోకి అడుగుపెట్టి అట్నించి తమిళ, తెలుగు సినిమాల వైపు అడుగులు వేసింది. 'యమదొంగ', 'చింతకాయల రవి' వంటి హిట్స్ ఆమెకు ఉన్నప్పటికీ కెరీర్ తెలుగులో ఆశించినంత వేగం పుంజుకోలేదు. అయితే ఈమధ్యనే 'కింగ్'లో ఓ చిన్న పాత్ర చేసి ఆ చిత్ర కథానాయకుడు నాగార్జునతోనే తిరిగి 'కేడి'లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల సినిమాల్లో నటించేది లేదనీ, సోలో హీరోయిన్ గా అవకాశాలు వస్తేనే ఒప్పుకుంటాననీ మమత తెగేసి చెబుతోంది కూడా. మమత కోరుకున్న అవకాశాలు వస్తాయా,అలా కానప్పడు బహ్రెయిన్ పిలుస్తోందంటూ తన మకాం మారుస్తుందా అనేది చూడాలి.
Be first to comment on this News / Article!
|