కాపురంలో కలతల్లేవు: మీనా
తన వైవాహిక జీవితంలో ఎలాంటి చిక్కులు లేవనీ, చిలకా గోరింకల్లా తమ కాపురం సాగుతోందనీ నటి మీనా వివరణ ఇచ్చింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా ఇటీవలే బెంగుళురుకు చెందిన విద్యాసాగర్ అనే ఇంజనీర్ ను పెళ్లాడింది. అయితే కొద్ది రోజులుగా వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. పెళ్లి తర్వాత మళ్లీ కొత్త చిత్రాలకు అగ్రిమెంట్ చేస్తూ భర్తను నిర్లక్ష్యం చేస్తోందనీ, చివరకు ముందుగా ప్లాన్ చేసుకున్న హనీమూన్ కూడా కేన్సిల్ చేసుకుని షూటింగ్ కు హాజరు కావడం ఆమె అత్తామామలు జీర్ణించుకోలేకున్నారనీ వార్తలు వచ్చాయి. త్వరలోనే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోనున్నారంటూ వదంతులు వినిపించాయి. వీటికి మీనా తాజాగా వివరణ ఇచ్చింది.
సినిమాల్లో నటించమని కానీ, స్వస్తి చెప్పమని కానీ తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవనీ, తాను కెరీర్ పరంగా తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తన భర్త తరఫు వారి నుంచి సంపూర్ణ సహకారం ఉందనీ మీనా చెప్పింది. ఇకనైనా వైవాహిక జీవితానికి సంబధించి వదంతులు పుట్టించ వద్దని మీడియాకు, అభిమానులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
Be first to comment on this News / Article!
|