ఫిల్మ్ సిటీలో 'కిల్లర్'
మాజీ మిస్ ఇండియా వరల్డ్ గద్దె సింధూర హీరోయిన్ గా శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నూతన నిర్మాత కిరణ్ నిర్మిస్తున్న చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ 'కిల్లర్'. నగేష్ నారదాశి దర్శకుడు. రామోజీ ఫిల్మ్ సిటీలో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తయింది.
నగేష్ నారదాశి మాట్లాడుతూ, ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామనీ, గద్దె సింధూర మెయిన్ లీడ్ పోషిస్తున్న చిత్రమిదనీ చెప్పారు. ఆమెకు ఈ చిత్రం పేరు తెస్తుందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందనీ తెలిపారు. ఇందులో ఐదు పాటలు ఉన్నాయనీ, మార్చి నెలలో ఆడియో రిలీజ్ చేసి ఏప్రిల్ లో సినిమా చేస్తామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జీవా, రామిరెడ్డి, రవిప్రకాష్, పొన్నాంబళం, సుమన్ శెట్టి, నిళల్ గళ్ రవి, తనికెళ్ల భరణి, దిల్ రమేష్, విజయ్ తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే సైతం నగేష్ నారదాశి అందించిన ఈ చిత్రానికి మధు ఎ నాయుడు సినిమాటోగ్రఫీ, నందు ఫైట్స్, ప్రదీప్ ఆంటోని కొరియోగ్రఫీ, సాయి కార్తీక్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|