'డాన్ శీను'కు క్విక్ బిజినెస్
ఈతరం హీరోల్లో రవితేజకు దొరికినన్ని వెరయిటీ రోల్స్ ఇంకెవరికీ దొరికుండకపోవచ్చు. 'నా ఆటోగ్రాఫ్', 'విక్రమార్కుడు', 'కిక్', 'శంభో శివ శంభో' వంటి చిత్రాలు వేటికవే వైవిధ్యంతో ప్రేక్షకులను అలరించినవే. ఇప్పుడు మరింత భిన్నమైన పాత్రలో 'డాన్ శీను' గా కనిపించబోతున్నారు. రవితేజతో 'కిక్' వంటి సెన్సేషన్ హిట్ ను ఇచ్చిన ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'కృష్ణ' చిత్రం తర్వాత మళ్లీ ఈ చిత్రంలో రవితేజకు జోడిగా త్రిష నటిస్తోంది. శ్రీహరి మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని నానక్ రామ్ గూడలో శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. నిర్మాణ దశలోనే ఈ చిత్రం నైజాం ఏరియా హక్కులను ఏసియన్ ఫిలిమ్స్ కు చెందిన సునీల్ ఫ్యాన్సీ ఆఫర్ తో దక్కించుకున్నారు. ఓవర్సీస్ హక్కులను గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ దక్కించుకుంది.
'కిక్' వంటి హిట్ తర్వాత తమ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రం మరింత పెద్ద హిట్ సాధిస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మార్చి 30 వరకూ హైద్రాబాద్ లో జరిగే షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్లోంది. అచ్చిరెడ్డి సమర్పలలో వి.సురేష్ రెడ్డి సహ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. కోన వెంకట్ సంభాషణ, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|