ఇవాల్టి హీరోల్లో రవితేజ మంచి డిమండ్ తో వరుస ఆఫర్లు అందిపుచ్చికుంటున్నారు. గత ఏడాది 'కిక్' వంటి సెన్సేషన్ హిట్ ను ఇచ్చిన రవితేజ ఈ ఏడాది 'శంభో శివ శంభో' చిత్రంతో తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న 'డాన్ శీను' ప్రోగ్రస్ లో ఉంది. రవితేజకు జోడిగా త్రిష నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో పాటు టాలీ 2 హాలీ సంస్థ 'వీర' అనే చిత్రాన్ని అనౌన్స్ చేసింది. 'రైడ్' ఫేట్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో తొలిసారిగా రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. తాజాగా మరో చిత్రానికి కూడా రవితేజ కమిట్ అయ్యారు. దీనికి 'మిరపకాయ' అనే తమాషా టైటిల్ ను నిశ్చయించినట్టు సమాచారం. 'వీడు చాలా హాట్ గురూ' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రవితేజ 'షాక్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన హరీష్ శంకర్ ను ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపిక చేశారు. మే లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. వీటికితోడు మరో రెండు చిత్రాలకు కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. దీంతో మరో ఏడాది వరకూ రవితేజ డైరీ నిండిపోతుంది.