'మగధీర' బ్లూ-రే డిస్క్ రిలీజ్
రామ్ చరణ్ కథానాయకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర' చిత్రం సరికొత్త టెక్నాలజీని సంతరించుకున్న 'బ్లూ-రే' డివిడి రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైద్రాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో 'మగధీర' బ్లూ-రే డివిడిలను చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి రిలీజ్ చేశారు. రామ్ చరణ్, రాజమౌళి, అల్లు అరవింద్ పాల్గొన్నారు.
బ్లూ-రే డీవిడి మంచి క్లారిటీతో చాలా స్పష్టంగా కనిపిస్తుందనీ, టెక్నాలజీలో కొత్త ఒరవడి ఇదనీ రామ్ చరణ్ తేజ అన్నారు. 'మగధీర' చిత్రం ఈ ఫార్మెట్ లో డివిడిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సూపర్ డూపర్ హిట్టయిన 'మగధీర' చిత్రాన్ని చక్కటి క్వాలిటీతో ఇంటిల్లిపాదీ చూసేలా బ్లూ-రే డివిడిలుగా రిలీజ్ చేస్తుండటం తమకెంతో గర్వంగా ఉందని రాజమౌళి, అల్లు అరవింద్ పేర్కొన్నారు. బాలాజీ మ్యూజిక్ ద్వారా మార్చి 3 నుంచి ఈ డీవిడిలు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి.
Be first to comment on this News / Article!
|