చివరి పాటలో 'వరుడు'
స్టయిలిష్ హీరో అల్లు అర్జున్, భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్ లో యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న 'వరుడు' చిత్రం చివరి పాట చిత్రీకరణకు రెడీ అవుతోంది. మార్చి 5 నుంచి రామనాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఐదు రోజుల పాటు పాట చిత్రీకరణ జరుపుతామని నిర్మాత దానయ్య తెలిపారు. హీరో హీరోయిన్లపై ఈ పాట చిత్రీకరణ ఉంటుందనీ, దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనీ తెలిపారు. మరోవైపు నిర్మాణంతర కార్యక్రమాలు కూడా చురుకుగా జరుగుతున్నట్టు చెప్పారు. మార్చి 26న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, అతని కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనీ గుణశేఖర్ తెలిపారు. తమిళ హీరో ఆర్య ఇందులో వినల్ గా అద్భుతంగా నటించారనీ, అలాగే 100కు పైగా కుటుంబాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాలో నటించడం మరో విశేషమనీ చెప్పారు. అన్ని పాటలకు వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం ఇచ్చారనీ, టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటూ విజువల్ గ్రాండియర్ తో అందర్నీ ఆకట్టుకునే చిత్రమవుతుందనీ అన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా ఓ కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. ఇతర పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, సింగీతం శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం గుణశేఖర్ అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, అశోక్ ఆర్ట్, స్టన్ శివ ఫైట్స్, ఆంథోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|