'మరోచరిత్ర' మ్యూజిక్ పోల్స్
మిక్కీ జె.మేయర్ సంగీత సారధ్యంలో రూపొందిన 'మరోచరిత్ర' పాటలకు మంచి స్పందన వస్తోందనీ, ఈ పాటలు ప్రజలకు మరింత చేరువ కావాలనే ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా వంద మ్యూజిక్ పోల్స్ ను ఏర్పాటు చేస్తున్నామనీ చిత్ర నిర్మాతలు దిల్ రాజు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇది కొత్త ప్రయోగమని ఆయన అన్నారు. వరుణ్ సందేశ్, అనిత జంటగా రూపొందిన ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సంస్థ కార్యాలయంలో దిల్ రాజు మాట్లాడుతూ, 'కొత్త బంగారు లోకం' తర్వాత మిక్కీ 'మరోచరిత్ర' కు వండ్రఫుల్ మ్యూజిక్ చేశారనీ, పాటలకు లభిస్తున్న ఆదరణ దృష్టిలో ఉంచుకుని మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ లో ఈ చిత్రం పాటలను వినే ఏర్పాటు చేశామనీ చెప్పారు. ప్రేమికల దినోత్సవం రోజున ఆడియో విడుదల చేశామనీ, ముఖ్యంగా 'ఏ తీగ పూవునో', 'భలె భలె మగాడివో బంగారు నా సామివో' పాటలను రీమిక్స్ చేసిన విధానం బాగుందని కీరవాణి, దేవీశ్రీప్రసాద్ మొచ్చుకున్నట్టు తెలిపారు. ఇవాల్టి జనరేష్ కు బాగా నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, అందుకు తగ్గట్టే పబ్లిసిటీ పరంగానూ కొత్త పంథాను ఎంచుకున్నామనీ ఆయన వివరించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, ప్రతాప్ పోతన్, ఊర్వశి, తలైవాసల్ విజయ్, జానకి సబేష్, ఆదర్శ్, వేణు, వెంకీ తదితరులు నటించారు. కె.బాలచందర్ మూలకథ అందించిన ఈ చిత్రానికి ఉమర్జీ ఆనంద్ మాటలు, స్త్రీన్ ప్లే, ఛాయాగ్రహణం, దర్శకత్వం రవియాదవ్ అందించారు.
Be first to comment on this News / Article!
|