'మై నేమ్ ఈజ్ అమృత' 12న
కీర్తి, బేబి గాయత్రి, భానుచందర్, భానుప్రియ ముఖ్య తారాగణంలో ఎస్.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ గౌని నిర్మిస్తున్న చిత్రం'మై నేమ్ ఈజ్ అమృత'. ఆంథోని దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒక విభిన్నమైన ప్రేమకథకు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు జోడించి రూపొందించిన చిత్రమిదని వెంకట్ గౌని తెలిపారు. వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఇందులో ఉందన్నారు. కొత్తదనాన్ని ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని అన్నారు. భానుచందర్, భానుప్రియ పాత్రలు అందరి మనసులను కదలిస్తాయని చెప్పారు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వచ్చిందనీ, 12న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నామనీ తెలిపారు. జీవా, కళ్లు చిదంబరం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రానికి మురళి బోడపాటి కథ-స్ర్రీన్ ప్లే, తోట వెంకటరమణి సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|