'దోపిడి'కి త్రిష రెడీ
అందాల నటి త్రిష కథానాయికగా నటించిన 'దోపిడి' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తొలి కాపీ సిద్ధమైంది. తమిళ స్టార్ హీరో విజయ్ ఇందులో హీరోగా నటించారు. సెన్సార్ ముగించుకుని మార్చి ప్రథమార్థంలో విడుదల చేసేందుకు అభి పిక్చర్స్ అధినేత బి.సత్యనారాయణ సన్నాహాలు చేస్తున్నారు.
చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టిన యువకుడు చెడు మార్గాల ద్వారా డబ్బుని ఆర్జిస్తున్న ఓ గొప్పింటి ఘరానా వ్యక్తిని దోచుకుని అతనికి ఏ విధంగా గుణపాఠం చెప్పాడనేది ఈ చిత్ర కథాంశమని అన్నారు. పూర్తి కమర్షియల్ విలువలతో ఈ చిత్రం తెరకెక్కిందని అన్నారు. విజయ్ కు జోడిగా త్రిష, మరో ముఖ్య పాత్రలో మాళవిక నటించింది. సుమన్, నాజర్, ఆశిష్
విద్యార్థి, జీవి, వివేక్ ఇతర పాత్రలు పోషించారు. ధరణి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్ రెడ్డి సంభాషణలు, సురేంద్రనాథ్ రెడ్డి ఎడిటింగ్, విద్యాసాగర్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|